Mon Mar 23 2026 07:26:04 GMT+0530 (India Standard Time)
T20 World Cup : పాక్ బాయ్ కాట్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదా?
టీ 20 వరల్డ్ కప్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.

టీ 20 వరల్డ్ కప్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటి వరకూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన వైఖరిని తెలియజేయలేదు. భారత్ తో పాకిస్తాన్ ఈ నెల 15వ తేదీన ఆడుతుందా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. కొలొంబోలో జరగనున్న ఈ మ్యాచ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం తాము భారత్ తో ఆడబోమని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తాము ఆడటం లేదని కానీ, ఆడుతున్నామని కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే చివరి నిమిషంలో తేల్చవచ్చు.
నిబంధనలను అతిక్రమిస్తే...
అయితే పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడకపోతే మాత్రం ఐసీసీ చర్యలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బలి అయ్యే అవకాశాలున్నాయి. ఐసీసీ నిబంధనలను అతిక్రమిస్తే తీవ్ర చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఐసీసీ, బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉల్లంఘిస్తే ఇక పాక్ కు భవిష్యత్ లో కష్టాలు తప్పవని మాజీ క్రికెటర్లు సయితం హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆసియాకప్ లో భారత్ - పాకిస్తాన్ ల మధ్య తలెత్తిన వివాదంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పెహల్గామ్ లో ఉగ్రదాడి, తర్వాత ఆపరేషన్ సింధూర్ వంటివి ఈ రెండు దేశాల క్రికెట్ పై ప్రభావం చూపాయి.
అప్పటి నుంచే...
అందుకే ఆసియా కప్ లో భారత్ జట్టు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధపడలేదు. అలాగే ట్రోఫీని భారత్ ముద్దాడింది. కసితో రగలిపోతున్న దాయాది పాక్ భారత్ తో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లుంది. అయితే మరికొద్ది గంటల మాత్రమే పాక్ వైఖరికి తెలియజేసేందుకు అవకాశముంది. తటస్థ వేదికపై మ్యాచ్ లు ఆడాల్సిన పాక్ మొండికేస్తే మాత్రం ఐసీసీ తీసుకునే చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు. ఇది ఎంత వరకూ దారి తీస్తుందంటే చివరకు పాక్ పై అన్ని క్రీడలపైన బ్యాన్ విధించే అవకాశముంది. ఈ వివాదం అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ దృష్టికి తీసుకెళితే పాక్ బాయక్ కాట్ కే మొగ్గు చూపితే భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందంటున్నారు.
Next Story

