Thu Jul 17 2025 00:43:03 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు ఐపీఎల్ లో అదిరిపోయే మ్యాచ్.. రెండు జట్లు ఢీ అంటే ఢీ
ఈరోజు ఐపీఎల్ లో క్వాలిఫయిర్ 1 మ్యాచ్ జరగనుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. ఛండీగఢ్ లో రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది

ఈరోజు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయిర్ 1 మ్యాచ్ జరగబోతుంది. అందులోనూ ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ లో అడుగు పెట్టడమే. అందుకే ఈ మ్యాచ్ కీలకం. రెండుజట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి అదరగొట్టే పెర్ ఫార్మెన్స్ తో ప్లేఆఫ్ రేసు వరకూ వచ్చాయి. అయితే రెండు జట్లకు మాత్రం ఇప్పటి వరకూ ఐపీఎల్ ప్రారంభమయిన తర్వాత ఛాంపియన్ షిప్ ను సాధించాలన్న కల నెరవేరలేదు. దాదాపు పదిహేడు సీజన్ల నుంచి పోరాడుతున్నప్పటికీ కప్పు చేతికి అందని జట్లు ఇవే. ఇక ఛాంపియన్స్ కావాలంటే రెండు అడుగుల దూరంలో ఉన్నాయి. అంటే రెండు మ్యాచ్ లు గెలిస్తే చాలు ఛాంపియన్ షిప్ గెలుచుకున్నట్లే. అందుకే ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదనే చెప్పాలి.
ఈ మ్యాచ్ లో ఓడినా...
ఈరోజు ఐపీఎల్ క్వాలిఫయిర్ 1 మ్యాచ్ జరగనుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. ఛండీగఢ్ లో రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ లోకి ప్రవేశించినట్లే. అందుకే తొలిసారి ఫైనల్స్ కు చేరుకునేదెవరన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. రెండు జట్లు మంచి ఫామ్ లో ఉండటమే ఇందుకు ఉదాహరణ. అయితే ఈ మ్యాచ్ లో ఓడినా ఫైనల్ లో చేరేందుకు మరొక ఛాన్స్ ఉంటుంది. అందుకే రెండు జట్లు చండీగఢ్ లో మామూలుగా పోరాటానికి దిగవు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ జట్లు ఈ ఐపీఎల్ లో మొత్తం పథ్నాలుగుమ్యాచ్ లు ఆడితే తొమ్మిది మ్యాచ్ లలో గెలిచాయి. ఐదు మ్యాచ్ లలో ఓడిపోయాయి. అంటే రెండు జట్లు సమానమైన బలంతో ఉన్నట్లే.
మంచి ఫామ్ లో...
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తన హోం పిచ్ లో ఓడిపోయినా బయట ఏ మ్యాచ్ ఆడినా గెలిచింది. మంచి ఓపెనర్లతో ప్రారంభం అదిరిపోయేలా ఉంది. ఛేదనలో కూడా ఈ జట్టుకు మంచి మార్కులే పడ్డాయి. అన్ని ఫార్మాట్లలో బలమైన ప్రదర్శన చేస్తుంది. విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ లో ఉండటం జట్టుకు కలసి వచ్చే అంశంగా చూడాలి. ఇక సాల్ట్ నిలబడితే చాలు విధ్వంసమే. మధ్యలో వచ్చే జితేశ్ శర్మ మామూలుగా ఆడటం లేదు. కష్టమైన మ్యాచ్ లో జట్టును ఆదుకుంటూ అనుకున్న దానికంటే ఎక్కువ ఆటతీరును కనపపరుస్తున్నాడు. బౌలింగ్ లోనూ ఆర్సీబీ సత్తా చాటుతుంది. జోష్, హేజిల్ వుడ్ లు సరైన సమయంలో వికెట్లు తీసుకుంటున్నారు. నువాన్ తుషార్ ఉండనే ఉన్నాడు. భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ బెంగళూరుకు బలంగా మారాడు.
తక్కువగా అంచనా వేయలేం...
ఇక పంజాబ్ ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసుకు కూడా చేరుకోలేదు. తొలిసారి వచ్చింది. సీజన్ ఆరంభం నుంచి మంచి ఫామ్ లో ఉండటం దీనికి కలసి వచ్చే అంశమే. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ లు ఇద్దరూ నిలబడ్డారంటే తట్టుకోవడం కష్టమే. శ్రేయస్ అయ్యర్ ఉండనే ఉన్నాడు. ఇంగ్లిస్ వీరబాదుడుతో జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తూ విజయాలను తెచ్చిపెడుతున్నాడు. స్టాయినిస్ కూడా ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక బౌలింగ్ లోనూ పంజాబ్ కింగ్స్ మామూలుగా లేదు. అర్షదీప్ సింగ్ తన బౌలింగ్ తో వికెట్లు తీయడమే కాకుండా రన్స్ కూడా తక్కువగా ఇస్తున్నాడు. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం కావడంతో రెండు వందలకు పైగానే స్కోరు నమోదు అయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. మరి గెలుపు ఎవరదన్నది చూడాలి.
Next Story