Tue Jul 08 2025 17:18:50 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఈ మ్యాచ్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో? గుజరాత్ vs ముంబయి మ్యాచ్ నేడు
ఈరోజు ఐపీఎల్ లో కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ నేడు జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీకొంటుంది

ఈరోజు ఐపీఎల్ లో కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. మరోఎలిమినేటర్ మ్యాచ్ నేడు జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీకొంటుంది. రెండు జట్లు ప్లేఆఫ్ కు దూసుకొచ్చినా ముంబయి ఇండియన్స్ ది మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఐపీఎల్ ఆరంభంలో అసలు ముంబయి ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంటుందా? అన్న అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. దాదాపు అన్నీ ఓటములే. అయితే తర్వాత క్రమంగా పుంజుకున్న ముంబయి ఇండియన్స్ మాత్రం అదిరే పెర్ ఫార్మెన్స తో ప్లేఆఫ్ వరకూ వచ్చింది. అయితే ఇప్పటికీ ఆజట్టు తడబడుతూనే ఉందని చెప్పాలి. అందుకే మొన్న జరిగిన పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ఈ పరిస్థితిని కొని తెచ్చుకుంది.
ప్లేఆఫ్ కు వచ్చేసరికి...
గుజరాత్ టైటాన్స్ సీజన్ మొదటి నుంచి మంచి ఆరంభంతో ప్రారంభించనినా ప్లేఆఫ్స్ కు వచ్చే సరికి కొంత తడబడుతుంది. ఓటములను కొని తెచ్చుకుంటుంది. బౌలర్లు సకాలంలో రాణించలేక పోవడంతో ఆ జట్టు తడబడుతోంది. బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్నప్పటికీ బౌలింగ్ లో ముంబయితో పోల్చుకుంటే కొంత వెనకబడినట్లే కనిపిస్తుంది. కాని క్వాలిఫయిర్ 1 మ్యాచ్ చూసిన తర్వాత ఈ మ్యాచ్ లోనూ ఏదైనా విచిత్రం జరగితే జరగొచ్చు. ఇక బట్లర్ కూడా లేకపోవడం ఆజట్టుకు ఇబ్బందిగా మారింది. బ్యాటింగ్ లో గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్ లో బలహీనంగా కనిపిస్తుంది. ముంబయి ఇండియన్స్ ది కూడా అదే పరిస్థితి. సూర్యకుమార్ యాదవ్ తప్ప ఎవరూ నిలకడగా ఆడటం లేదు.
రెండు జట్లు...
ముంబయి ఇండియన్స్ కు కూడా ఈ మ్యాచ్ గెలవడం అంత సులువు కాదు. ఎందుకంటే రికిల్ టన్, విల్ జాక్స్ స్వదేశాలకు వెళ్లిపోయారు. రోహిత్ శర్మ ఈ సీజన్ లో పెద్దగా రాణించలేదు. ఏదో ఒకటి రెండు మ్యాచ్ లు తప్పించి రోహిత్ పెద్దగా ఈసారి పరుగులు చేయలేదు. ఒక్క సూర్యకుమార్ యాదవ్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. అందుకని రెండు జట్లు బలంగా, బలహీనంగానే కనిపిస్తున్నాయి. చేసే స్కోరును బట్టి ఏ జట్టు విజయం సాధిస్తుందన్నది తేలుతుంది. దీంతో పాటు లక్కు కూడా కలసి రావాలి. ఈ మ్యాచ్ లో ఓడిపోతే ముంబయి ఇండియన్స్ ఇంటి దారి పట్టినట్లే. గుజరాత్ టైటాన్స్ కూడా సర్దుకునట్లే. అందుకే ఈ మ్యాచ్ కీలకం అనే చెప్పాలి.
Next Story