Fri Dec 05 2025 18:38:48 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England : నేటి నుంచి ఇండియా - ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్.. సిరీస్ పై ఆధిపత్యం కోసం?
ఈరోజు నుంచి లార్డ్స్ లో ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈరోజు నుంచి లార్డ్స్ లో ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన వారు సిరీస్ లో ఆధిపత్యంలో ఉంటారు. అందుకే లార్డ్స్ లో నేటి నుంచి జరిగే టెస్ట్ కీలకంగా మారనుంది. భారత్ పరంగా చూస్తే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా ఎలా చూసినా నిలకడగా ఆడగలిగితే భారీ స్కోరు చేసే అవకాశాలున్నాయి. అయితే లార్డ్స్ మైదానం పేసర్లకు స్వర్గధామంగా చెబుతుంటారు. మరి ఈ పిచ్ ను ఎలా తయారు చేశారో తెలియదు కానీ మామూలుగా అయితే లార్డ్స్ మైదానం పేసర్లకు వికెట్ల వర్షం కురిపిస్తుంది.
మళ్లీ బౌలర్లే కీలకమా?
భారత్ మాత్రం బౌలర్లలో బుమ్రా తప్పించి టెస్ట్ లలో అందరూ కొత్త వారే. స్పిన్నర్లకు ఇక్కడ పెద్దగా టిక్కెట్లు తీసే అవకాశం లేకపోవడంతో ఎక్కువ మంది పేసర్లకు చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకవేళ ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చినా వెంటవెంటనే వికెట్లు తీయడంలో పేసర్లు ప్రాధాన్యత వహిస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే జస్పిత్ బూమ్రాతో పాటు ఆకాశ్ దీప్, సిరాజ్, అర్షదీప్ సింగ్ ను కూడా జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. బుమ్రా ఎన్ని ఓవర్లయినా అలుపెరగకుండా వేగంగా బంతులు విసరడంలో దిట్ట కావడంతో పాటు కష్టకాలంలో వికెట్లు తీయడంతో పాటు అనుభవమున్న బౌలర్ కావడంతో ఈ మ్యాచ్ లో బుమ్రా టీం ఇండియాకు ఉపయోగపడే అవకాశముంది.
నలుగురు పేసర్లతో...
మరొక వైపు బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేస్తారన్న పేరుంది. దీంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండటంతో జాగ్రత్తగా ఆడగలిగితే లార్డ్స్ లోనూ ఇండియా విజయాన్ని సులువుగా అందిపుచ్చుకోవచ్చన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. కొందరు బ్యాటర్లను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసినా మరికొందరికి అవకాశం కల్పించవచ్చు.ముఖ్యంగా గత రెండు మ్యాచ్ లలో వరసగా విఫలమయిన నితీష్ కుమార్ రెడ్డి, కరుణ్ నాయర్ లను పక్కన పెట్టి ఆ ప్లేస్ లో సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఇంగ్లండ్ జట్టు కూడా మంచి కసి మీదుంది. బర్మింగ్ హామ్ టెస్ట్ లో దారుణ ఓటమిని చవి చూసిన ఇంగ్లండ్ ఇండియాపై లార్డ్స్ లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. మరి ఆట ఎలా .. ఎవరివైపు సాగుతుందన్నది చూడాలి.
Next Story

