Sat Dec 06 2025 09:16:17 GMT+0000 (Coordinated Universal Time)
వర్షం వచ్చింది.. సిరీస్ సొంతమయింది
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో మూడో మ్యాచ్ టై అయింది

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో మూడో మ్యాచ్ టై అయింది. ఈ కారణంగా సిరీస్ 1 - 0 తో భారత్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తో భారత్ తొలి టీ 20 మ్యాచ్ ప్రారంభం కాకుండానే రద్దయింది. రెండో మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 111 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.
మూడో మ్యాచ్ లో...
ఇక మూడో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 160 పరుగులు చేసింది. 161 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. తొమ్మిది ఓవర్లకు గానను నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు భారత్ చేసింది. ఈ సమయంలో భారీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. డవక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై గా ముగిసింది. ఒక మ్యాచ్ ను ముందే గెలవడంతో భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు.
- Tags
- new zealand
- india
Next Story

