Tue Mar 17 2026 02:59:44 GMT+0530 (India Standard Time)
సిరీస్ ఎవరిదో? నేడు కూడా మ్యాచ్ ఆలస్యం
భారత్ - వెస్టిండీస్ మధ్య మూడో టీ 20 నేడు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా గంటన్నర ఆలస్యంగా జరుగుతుంది.

భారత్ - వెస్టిండీస్ మధ్య మూడో టీ 20 నేడు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా గంటన్నర ఆలస్యంగా జరుగుతుందని విండీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. నిన్న 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 11 గంటలకు కాని ప్రారంభం కాలేదు. టీం ఇండియా ఆటగాళ్ల లగేజీ రాకపోవడంతో మ్యాచ్ ను ఆలస్యంగా ప్రారంభించారు. అయితే ఈరోజు మ్యాచ్ ఆలస్యం కావడానికి ఆటగాళ్లకు తగినంత విశ్రాంతిని ఇవ్వడానికేనని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇరు జట్లు...
అందుకే ఈరోజు మూడో టీ 20 మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు గాని ప్రారంభం కాదు. వెస్టిండీస్ లో జరిగే టీ 20 మ్యాచ్ లు క్రీడాభిమానులు చూడలేకపోతున్నారు. ఆలస్యంగా జరుగుతుండటంతో ఎక్కువ మంది వీక్షించలేకపోతున్నారు. అయితే ఈరోజు జరిగే మూడో టీ 20 మ్యాచ్ కీలకంగా మారనుంది. రెండు మ్యాచ్ లలో ఇండియా, విండీస్ చెరొక మ్యాచ్ ను గెలిచాయి. ఇరుజట్లు బలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలచి ఎవరు సిరీస్ ను కైవసం చేసుకుంటారో చూడాలి మరి.
Next Story

