Mon Feb 02 2026 12:24:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చివరి వన్డే... ఫలితం ఎటైనా?
ఈరోజు కేప్ టౌన్ లో భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడో వన్ డే నేడు జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత్ దక్షిణాఫ్రికా పర్యటన అచ్చి వచ్చిననట్లు లేదు. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది. టెస్ట్ సిరీస్ కోల్పోయినా వన్డే సిరీస్ లో అయినా భారత్ నిలదొక్కుకుంటుందన్న అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. ఈరోజు కేప్ టౌన్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడో వన్ డే నేడు జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారీ మార్పులతో....
ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లలో ఓటమి పాలయిన భారత్ వన్డే సిరీస్ ను చేజార్చుకుంది. ఈ వన్డే నామమాత్రమే. అయితే ఫలితం ఎలా వచ్చినా భారత్ జట్టులో కొన్ని ప్రయోగాలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భువనేశ్వర్ స్థానంలో దీపక్ చాహర్, బూమ్రా స్థానంలో సిరాజ్ కు అవకాశమివ్వాలని యోచిస్తుంది. విరాట్ కొహ్లికి కూడా విశ్రాంతిని ఇచ్చి ఆయన స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కు చోటు కల్పించే అవకాశాలున్నాయి. మొత్తం మీద జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
Next Story

