Sat Mar 07 2026 20:42:11 GMT+0530 (India Standard Time)
నేడు మూడో వన్డే.. సిరీస్ ఎవరిదో?
భారత్ - ఇంగ్లండ్ మూడో వన్డే నేడు జరగనునంది. ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది

భారత్ - ఇంగ్లండ్ మూడో వన్డే నేడు జరగనునంది. ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. మూడు మ్యాచ్ లలో 1 -1 తో సమానంగా ఉన్న ఇరు జట్లు ఈరోజు తలపడే మ్యాచ్ లో సిరీస్ ఎవరి పరం అన్నది తేలనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్, రెండో వన్డేలో ఓటమి పాలయింది. ఇప్పుడు మూడో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ సిరీస్ ను తేల్చనున్నాయి. మాంచెస్టర్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.
సొంత గడ్డపై...
అలాగే సొంత గడ్డపై వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న కసితో ఇంగ్లండ్ ఉంది. రెండో మ్యాచ్ నుంచి పుంజుకున్న ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ సమమయ్యాయి. టీ 20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.
Next Story

