Fri Jan 30 2026 03:08:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చివరి వన్డే
నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్కు సీనియర్ ఆటగాళ్లకు అందుబాటులోకి వచ్చారు

నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్కు సీనియర్ ఆటగాళ్లకు అందుబాటులోకి వచ్చారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కొహ్లి కూడా ఈ మ్యాచ్లో ఆడనున్నారు. తొలి రెండు మ్యాచ్ లను గెలిచిన టీం ఇండియా మూడో మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. ఆస్ట్రేలియా కనీసం ఒక మ్యాచ్ లోనైనా భారత్ మీద గెలిచి వరల్డ్ కప్ కు సిద్ధమవ్వాలని యోచిస్తుంది.
సీనియర్లకు...
ఈ మ్యాచ్ లో గాయం కారణంగా అక్షర్ పటేల్ దూరమయ్యారు. అలాగే ఓపెనర్ శుభమన్ గిల్ కు ఈ మ్యాచ్లో విశ్రాంతి నిచ్చారు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీలు కూడా ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. హార్ధిక్ పాండ్యా కు కూడా విశ్రాంతి లభించింది. రాజ్కోట్ లో జరగనున్న ఈ మ్యాచ్ కు పేసర్ ముఖేష్ కుమార్కు చోటు కల్పించారు. ఈ మ్యాచ్ ను కూడా ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్లీన్ స్వీప్ చేయాలని భారత్, ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని ఆస్ట్రేలియా ప్రయత్నిస్తున్నాయి.
Next Story

