ట్రోఫీ మెడల్స్ ఇస్తాడట.. కానీ!!
ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించినా ట్రోఫీని అందుకోలేకపోయింది.

ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ విజేతగా నిలిచిన భారత జట్టుకు మెడల్స్ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అయితే దానికోసం ఒక అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని షరతు విధించినట్లు తెలుస్తోంది. మొహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. హైడ్రామా అనంతరం నఖ్వీ వేదిక దిగి స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఏసీసీ అధికారులు కూడా ట్రోఫీని తీసుకుని ఆయన వెంటే వెళ్లిపోయారు. ఈ వివాదాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. దుబాయ్‌లో జరగనున్న ఏసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనుంది.

