Tue Dec 16 2025 16:54:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇచ్చేది 18 కోట్లే రూల్ తెలుసా?
ఐపీఎల్ వేలంలో పలువురు విదేశీ క్రికెటర్లకు భారీ ధర పలకనుంది

ఐపీఎల్ వేలంలో పలువురు విదేశీ క్రికెటర్లకు భారీ ధర పలకనుంది. గ్రీన్‌తో పాటు కేకేఆర్ రిలీజ్ చేసిన ఇండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ కు భారీ డిమాండ్ ఉంది. ఈ వేలంలో గ్రీన్ బిడ్ 25 కోట్ల రూపాయలు దాటినా ఐపీఎల్ గరిష్ట రుసుము నిబంధనల ప్రకారం ఈ సీజన్లో అతనికి జీతంగా 18 కోట్లు మాత్రమే అందనుంది. బిడ్ మొత్తం జట్టు పర్స్ నుంచి కట్ అవుతుంది. కానీ ఆటగాడికి మాత్రం 18 కోట్లే చెల్లిస్తారు. మిగిలింది బీసీసీఐ కు చేరుతుంది.
ఇక ఒకే బిడ్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు నిలిచిపోయినప్పుడు ‘టై-బ్రేకర్ ఫామ్’ ను వాడనున్నారు. ఈ ఫామ్‌లో ఫ్రాంచైజీలు ఒక ‘రహస్య బిడ్’ మొత్తాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ రహస్య బిడ్‌లో అత్యధిక మొత్తం రాసిన జట్టు ఆ ఆటగాడిని గెలుచుకుంటుంది.
Next Story

