Sat Jul 12 2025 22:44:52 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఇప్పుడు రైజ్ అయి లాభమేముంది? ఆరెంజ్ ఆర్మీకి ఆశలు ఏ రేంజ్ లో?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి నిలిచిందని చెప్పుకోవడానికి మినహా మరో ఛాన్స్ లేదు

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి నిలిచిందని చెప్పుకోవడానికి మినహా మరో ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక అన్ని మ్యాచ్ లలో గెలుపు సాధిస్తేనే ప్లే ఆఫ్ కు ఆరెంజ్ ఆర్మీ చేరుకుంటుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో గెలిచిన తర్వాత జట్టులో కొంత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపించినప్పటికీ సరైన సమయంలో ప్లేయర్లు దూకుడుగా ఆడలేకపోతుండటం జట్టు మేనేజ్ మెంట్ ను కూడా కలవర పరుస్తుంది. రాజస్థాన్ ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో ఒక అడుగు ముందుకు వేసినా ఇంకా అనేక అడుగులు వేసి విజయాలు సాధిస్తేనే ఆరెంజ్ ఆర్మీకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ లభిస్తాయి.
వరస వైఫల్యాలతో...
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడితే అందులో మూడు మ్యాచ్ లుమాత్రమే గెలిచి ఆరు పాయింట్లను సాధించింది. అదీ నిన్న జరిగిన మ్యాచ్ తోనే మరో పాయింట్ సాధించినట్లయింది. చాలా రోజుల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కు విజయం లభించింది. గత సీజన్ లో ఉప్పల్ ఊది పారేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి మాత్రం తేలిపోయింది. బ్యాటర్లు కూడా వరసగా విఫలమవుతున్నారు. అసలు కనీసం నిలబడి పోరాటం చేసే పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ లేదు.
ఫామ్ కోల్పోయి...
నిన్న కూడా అభిషేక్ శర్మ జీరో పరుగలకు అవుట్ కావడంతో పాటు హెడ్ కూడా ఫామ్ ను కోల్పోయినట్లు కనిపించాడు. ఇషాన్ కిషన్ ఎప్పుడు ఆడతాడో.. ఎప్పుడు అవుటయి వెళ్లిపోతాడో అతనికే తెలియదు. క్లాసెన్ కొంత మెరుగైన ప్రదర్శన ఈ సీజన్ లో చేస్తున్నప్పటికీ నిన్న మ్యాచ్ లో విఫలమయ్యాడు. అనికేత్, నితీశ్ రెడ్డి ఇలా అందరూ ఫామ్ లో లేకపోవడం కలవర పర్చే అంశమే. అందుకే ఈ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే అంత సులువు కాదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ కు గెలిచామన్న ఆనందం లేకపోగా, నిలుస్తామా? అన్న అనుమానం మాత్రం ఎక్కువగానే ఉంది.
Next Story