Mon Mar 16 2026 10:36:50 GMT+0530 (India Standard Time)
అమ్మాయిలు కప్ అందుకోవాలి!!
ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసింది. ఇక క్రికెట్ ప్రియులను అలరించడానికి మహిళల ప్రపంచకప్ కు సమయం దగ్గర పడింది.

ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసింది. ఇక క్రికెట్ ప్రియులను అలరించడానికి మహిళల ప్రపంచకప్ కు సమయం దగ్గర పడింది. సెప్టెంబర్ 30న మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. నవంబర్ 2 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పాల్గొంటున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ టోర్నీలో భాగంగా గువాహటిలో తొలి మ్యాచ్ భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

