Sat Dec 06 2025 12:34:47 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి టెస్ట్ సిరీస్... టీం ఇండియా బలంగా
నేటి నుంచి దక్షిణాఫ్రికా, భారత్ ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ సెంచూరియన్ లో జరగనుంది.

నేటి నుంచి దక్షిణాఫ్రికా, భారత్ ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ సెంచూరియన్ లో జరగనుంది. ఇరు జట్లు గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. ప్రధానంగా భారత్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ లో బలంగా ఉందని, దక్షిణాఫ్రికా పిచ్ లపై ఇండియా పేసర్లు రాణించగలుగుతారని టీం ఇండియా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఇటీవల జరిగిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో మంచి ప్రతిభ కనపర్చిన టీం ఇండియా దక్షిణాఫ్రికాలోనూ రాణిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
ధీమాగా ఉన్న సౌతాఫ్రికా
మరోవైపు హోం పిచ్ కావడంతో తమకే అడ్వాంటేజీ ఉంటుందని సౌతాఫ్రికా ధీమాగా ఉంది. సౌతాఫ్రికా బౌలర్లు అదనపు బౌన్స్, స్వింగ్ ను రాబట్టి మంచి ఫలితాలను రాబడతారని ఆ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గార్ అంటున్నారు. తమకు పటిష్టమైన బౌలర్లు ఉన్నారని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద చాలా కాలం తర్వాత సౌతాఫ్రికాతో భారత్ జట్టు తలపడనుంది. టెస్ట్ సిరీస్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
Next Story

