Sun Dec 08 2024 09:18:52 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలంక టూర్...నేడే భారత జట్టు ప్రకటన
ఈనెల 27వ తేదీ నుంచి టీం ఇండియా శ్రీలంక పర్యటన ఖరారయింది
ఈనెల 27వ తేదీ నుంచి టీం ఇండియా శ్రీలంక పర్యటన ఖరారయింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించే అవకాశముందని తెలిసింది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడింది.
యువజట్టు...
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే ఇటీవల జింబాబ్వేలో పర్యటించిన యువజట్టు సిరీస్ ను గెలుచుకున్న నేపథ్యంలో యువజట్టుకే ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. సీనియర్లకు ఈ ట్రిప్ కు కూడా విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి.
Next Story