Fri Dec 05 2025 21:16:24 GMT+0000 (Coordinated Universal Time)
రెండో టీ20లో గెలుపుకోసం?
నేడు దక్షిణాఫ్రికాతో టీం ఇండియా రెండో టీ 20 మ్యాచ్ ఆడనుంది. ఒడిశాలోని కటక్ లో ఈ మ్యాచ్ జరగనుంది

నేడు దక్షిణాఫ్రికాతో టీం ఇండియా రెండో టీ 20 మ్యాచ్ ఆడనుంది. ఒడిశాలోని కటక్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్ ను కోల్పోయిన టీం ఇండియా ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్ లో బౌలర్ల వైఫ్యలం కొట్టొచ్చినట్లు కనపడింది. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్ రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా జట్టు ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
జట్లులో మార్పులు....
అయితే ఈసారి గెలుపు కోసం జట్టులో ఇండియా కొన్ని మార్పులు చేసే అవకాశముంది. తొలి వన్డేలో భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్ మాత్రమే రాణించారు. దీంతో బౌలర్లను మార్చే అవకాశముంది. జట్టులో ఉన్న ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్ లో ఒకరికి చోటు కల్పించే అవకాశాలున్నాయి. బ్యాట్స్ మెన్ లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చంటున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

