Fri Dec 05 2025 12:01:28 GMT+0000 (Coordinated Universal Time)
Team India : నేటి నుంచి వెస్టిండీస్ తో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్
నేటి నుంచి వెస్టిండీస్ తో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది

నేటి నుంచి వెస్టిండీస్ తో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్ లో ఛాంపియన్ గా నిలిచి టీం ఇండియా వెస్టిండీస్ తో తలపడనుంది. భారత్ లో జరగుతున్న ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల కోసం ఇప్పటికే టీం ఇండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనింది. అయితే ప్రాక్టీస్ సెషన్ లో జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ కనిపించలేదు. ఆసియా కప్ లో ఆడిన ఈ ముగ్గురు విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు.
ప్రాక్టీస్ సెషన్ లో...
ఆసియా కప్ 2025లో అన్ని మ్యాచ్ లు ఆడిన టీం ఇండియా జట్టు ఈ సిరీస్ ను సొంత గడ్డపై కైవసం చేసుకోవాలని తహతహలాడుతుంది. శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్, కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ లో ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. సాయిసుదర్శన్, దేవదత్ పడిక్కల్ కూడా ప్రాక్టీస్ సెషన్ లో కనిపించారు. ఆసియా కప్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన శుభమన్ గిల్ ప్రాక్టీస్ లో ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ తో ప్రాక్టీస్ చేశారు. టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ దగ్గరుండి ప్రాక్టీస్ సెషన్ ను పర్యవేక్షించారు.
సొంత గడ్డపై...
అయితే జట్టులో దేవదత్ పడిక్కల్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముందని తెలిసింది. నితీష్ కుమార్ రెడ్డితో భారత జట్టుకు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ పరంగా అదనపు బలం చేకూరినట్లయింది. అయితే అహ్మాదాబాద్ పిచ్ స్పిన్ కు అనుకూలం కావడంతో జడేజా, కులదీప్ యాదవ్ లు ఈ టెస్ట్ మ్యాచ్ లో కీలకంగా మారనున్నారు. వెస్టిండీస్ జట్టు కూడా టెస్ట్ మ్యాచ్ లో సత్తా చాటాలని నిర్ణయించుకుంది. అయితే భారత జట్టు సొంత మైదానంలో ఓడించడం అంత తేలిక కాదన్నది క్రీడా విశ్లేషకుల అంచనా. ఈరోజు నుంచి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ ఎవరిది విజయం అన్నది తేలనుంది.
Next Story

