Fri Mar 27 2026 23:41:20 GMT+0530 (India Standard Time)
T20 World Cup : ఇలా అయితే.. ఛాంపియన్ కావడానికి టీం ఇండియాకు కష్టమేనట
టీ20 వరల్డ్ కప్ లో అమెరికా పై టీం ఇండియా గెలిచినా ఆడిన తీరు మాత్రం విమర్శలకు దారి తీసింది

టీ20 వరల్డ్ కప్ లో అమెరికా పై టీం ఇండియా గెలిచినా ఆడిన తీరు మాత్రం విమర్శలకు దారి తీసింది. సూర్యకుమార్ యాదవ్ సరిగా ఆడకపోతే భారత్ పరువు తొలి ఆటలోనే పోయేది. అది వాస్తవం. బాక్సు లో కూర్చున్న టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొహం మీద నెత్తుటి చుక్క కనిపించలేదు. మ్యాచ్ లో ఆటగాడు విఫలమవ్వడం సహజమే. కానీ ఎంతో ఆశలు పెట్టుకున్న బ్యాటర్లు వరసపెట్టి అవుటవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? నిర్లక్ష్యమా? లేక నిలకడలేని తనం లేకపోవడమా? అన్నది తెలియాల్సి ఉంది.
వరసగా అవుట్ కావడంతో...
అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్స్ కొట్టాలని ప్రయత్నించడమూ అలాగే చూడాలి. ముందుగా బంతికి అలవాటు పడి కనీసం రెండు మూడు బంతులు ఆడిన తర్వవాత బంతి వేగం, వచ్చే గమనాన్ని అంచనా వేసి అప్పుడు దూకుడుగా ఆడొచ్చు. కానీ అభిషేక్ శర్మ పేరు కోసమే ఆడాలని ఆడుతున్నట్లుంది. ఇక తిలక్ వర్మ ఎప్పుడూ అంత త్వరగా అవుట్ కాడు. నిదానంగా ఆడే వ్యక్తి కూడా క్యాచ్ ఇచ్చిఅవుటయ్యాడు. రింకూ సింగ్ కూడా రాణించలేదు. ఇక హార్ధిక్ పాండ్యా నిరాశపర్చడం తో టీం ఇండియా పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక శివమ్ దూబె ఫస్ట్ బాల్ కే అవుట్ కావడం కూడా కొంత టెన్షన్ పెట్టింది.
మిగిలిన జట్లతో...
సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించలేకపోతే మన పరిస్థిత ఏంటన్నది క్రికెట్ ఫ్యాన్స్ ను ఆందోళనలో పడేసింది. అమెరికా చేతిలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన జట్లతో టీం ఇండియా ఎలా ఆడుతుందోనన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఫుల్ ఫామ్ లో ఉన్నట్లుగా నిన్నటి వరకూ కనిపించినప్పటికీ అమెరికాతో టీం ఇండియా ఆట చూసిన తర్వాత ఇక ప్రతి ఆట ఒక సమరమే అని అనుకోవాల్సి ఉంటుందన్నవిశ్లేషణలు వినపడుతున్నాయి. వరగసా రెండుసార్లు ఛాంపియన్ ట్రోఫీని అందుకోవడం ఇంత వరకూ జరగలేదు. ఆతిధ్య జట్టు కప్ గెలుచుకోకపోవడం కూడా జరగలేదు. మరి టీం ఇండియా హిస్టరీ రిపీట్.. హిస్టరీ డిఫీట్ నినాదం భారత్ అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.
Next Story

