Fri Mar 20 2026 13:01:53 GMT+0530 (India Standard Time)
సిరీస్ సమర్పయామి
సౌతాఫ్రికాపై టీం ఇండియా పరాజయం పొందింది. మూడో టెస్ట్ లోనూ టీం ఇండియా చేతులెత్తేయడంతో సిరీస్ సౌతాఫ్రికా పరమయింది.

సౌతాఫ్రికాపై టీం ఇండియా పరాజయం పొందింది. మూడో టెస్ట్ లోనూ టీం ఇండియా చేతులెత్తేయడంతో సిరీస్ సౌతాఫ్రికా పరమయింది. తొలి టెస్ట్ గెలిచిన టీం ఇండియా వరసగా రెండు టెస్ట్ లలోనూ ఓటమి పాలయింది. కేప్ టౌన్ లో జరిగిన మూడో టెస్ట్ లో 212 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది.
బౌలర్లు....
అన్ని రంగాల్లో టీంఇండియా ఆటగాళ్లు నిరాశపర్చారు. సొంత గడ్డపై సౌతాఫ్రికా విజయం సాధించింది. ప్రధానంగా టీం ఇండియా బౌలర్లు వికెట్లు వేగంగా తీయలేకపోయారు. తొలి టెస్ట్ లో ఓడిపోయిన సౌతాఫ్రికా జట్టు కసి మీద రెండు టెస్ట్ లను వరసగా గెలిచి టీం ఇండియాకు ఓటమిని రుచి చూపించింది.
Next Story

