Tue Jul 08 2025 17:11:03 GMT+0000 (Coordinated Universal Time)
Ind vs End Second Test : అల్లంత దూరంలో విజయం.. టీం ఇండియా అందుకుంటుందా?
భారత్ - ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియాకు విజయం అతి చేరువలో ఉంది.

భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియాకు విజయం అతి చేరువలో ఉంది. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ పై టీం ఇండియా పట్టుబిగిస్తుంది. శుభమన్ గిల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. మరో సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇక బౌలర్లు తమ చేతికి పని చెబితే మాత్రం విజయం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లండ్ ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఇప్పుడు రెండే భారత్ ముందున్నాయి. ఒకటి ఈ రెండో టెస్ట్ లో భారత్ విజయం సాధించడం. రెండోది ఇంగ్లండ్ గట్టిగా నిలబడితే మాత్రమ డ్రా కావడం తప్ప మ్యాచ్ లో ఓటమి అనేది భారత్ కు ఉండదన్నది తేలిపోయింది.
రెండో ఇన్నింగ్స్ లో...
ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను డ్రా చేసుకునే అవకాశం భారత్ కు ఉంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో తడబడటం ప్రారంభించారు. మన బౌలర్లు సత్తా చూపుతున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ భారత్ కంటే 608 పరుగుల ఆధిక్యంతో ఉండగా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈరోజు ఇంగ్లండ్ దూకుడుగా ఆడి వికెట్లుసమర్పించుకుని ఓటమిని కొని తెచ్చుకుంటుందా? లేక రోజంతా ఆడి టీమిండియా విజయాన్ని అడ్డుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. టీం ఇండియాకు గెలుపుపైనే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
గిల్ మంచి ఫామ్ లో...
కెప్టెన్ శుభమన్ గిల్ ఈ పర్యటనలో మంచి ఫామ్ లో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ గిల్ 162 బంతుల్లో 161 పరుగుల చేశఆడు. దీంతో 427 వద్ద భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇందులో రిషబ్ పంత్ మరోసారి తనదైన స్టయిల్ లో ఆడి 65 పరుగులు చేశాడు. జడేజా 69 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులతో ఉన్న టీం ఇండియా మొత్తం 608 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి 72 పరుగులు మాత్రమే చేసింది. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. సిరాజ్ ఒక వికెట్ తీసి ఇంగ్లండ్ ను ట్రబుల్ లో పడేశాడు. దీంతో ఎలా చూసినా విజయం మాత్రం ఇండియా వైపు తొంగి చూస్తుంది. మనోళ్లు చాలా జాగ్రత్తగా ఆడగలిగితే మాత్రం ఈ మ్యాచ్ ను దొరకబుచ్చుకోవడం సులువేననన్నది క్రీడా విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story