Mon Mar 16 2026 10:37:27 GMT+0530 (India Standard Time)
బార్బడోస్ లోనే టీమిండియా జట్టు
తుపాను కారణంగా బార్బడోస్ లోనే టీమిండియా చిక్కుకు పోయారు. హోటల్ గదులకే పరిమితమయ్యారు

తుపాను కారణంగా బార్బడోస్ లోనే టీమిండియా చిక్కుకు పోయారు. హోటల్ గదులకే పరిమితమయ్యారు. వాస్తవానికి ఇప్పటికే టీం ఇండియా సభ్యులు ఇండియాకు చేరుకోవాల్సి ఉంది. అయితే అక్కడ తుపాను హెచ్చరికలు జారీ చేయడం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాశ్రయంలో రాకపోకలను నిలిపేశారు.
తుపాను హెచ్చరికలతో...
ప్రభుత్వం తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బార్బడోస్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్ లోనే భారత క్రికెట్ జట్టు ఉండిపోయింది. టీ 20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టు కప్పుతో ఇండియాకు చేరుకుందనుకుంటే తుపాను కారణంగా అక్కడే ఆటగాళ్లు నిలిచిపోయారు.
Next Story

