Fri Dec 05 2025 12:23:09 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : ఆసియా కప్ లో బోణీ అదిరిందిగా... చిన్న టీం అయినా?
ఆసియా కప్ లో టీం ఇండియా శుభారంభం అదిరింది. దుబాయ్ లో జరిగిన యూఏఈపై భారత్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆసియా కప్ లో టీం ఇండియా శుభారంభం అదిరింది. దుబాయ్ లో జరిగిన యూఏఈపై భారత్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. కేవలం 4.3 ఓవర్లలోనే విక్టరీని కొట్టేసింది. తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేధించింది. టీం ఇండియా ఇదే జోరు కొనసాగించాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలమని, టాస్ గెలిస్తే తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటుందన్న అంచనాల ప్రకారం టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేసుకుని ఎక్కువ పరుగులు చేసి రన్ రేట్ పెంచుకోవాలన్న ప్రయత్నం చేయకుండా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న రీతిలో టీం ఇండియా కెప్టెన్ వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసించారు.
4.3 ఓవర్లలోనే 57 పరుగులకు...
తొలుత బ్యాటింగ్ కు దిగిన యూఏఈ తొలి ఓవర్ లో దూకుడును చూపించింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్ ను ఒక ఆటాడుకుంది. హార్ధిక్ పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్ ప్రయత్నించినప్పటికీ మొదటి మూడు ఓవర్లకు ఒక్క వికెట్ కూడా పడలేదు. అయితే నాలుగో ఓవర్ నుంచి మ్యాచ్ టర్న్ అయింది. మంచి ఊపు మీదున్న యూఏఈ ఓపెనర్ అలిషన్ షరాఫ్ ను బుమ్రా అవుట్ చేయడంతో ఆ జట్టు పతనం ప్రారంభమయిందనే చెప్పాలి. ఇక యూఏఈ ఆటగాళ్లు ఎవరూ పెద్దగా క్రీజులో నిలబడలేకపోయారు. జస్ప్రిత్ బూమ్రా బౌలింగ్ కు ఇబ్బందులు పడ్డారు. తర్వాత కులదీప్ యాదవ్ తన చేతిలో బంతిని తిప్పుతూ ఆటగాళ్లను వరసగా పెవిలియన్ బాట పట్టించాడు.
ఒక వికెట్ కోల్పోయి...
కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీయడంతో కేవలం 57 పరుగులకు యూఏఈ ఆల్ అవుట్ అయింది. ఇది పెద్ద స్కోరు కాదు. అయినా భారట ఆటగాళ్లు దూకుడుగానే ఆడుతూ మంచి షాట్లు కొడుతూ లక్ష్యాన్ని సాధించారు. భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారుకున్నారు. కానీ అభిషేక్ శర్మ తన దూకుడును ఇంకా వదులుకోలేదు. అభిషేక్ 30 పరుగులు చేసి అవుటయ్యాడు. గిల్ 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సూర్య కుమార్ యాదవ్ ఏడు పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. భారత్ జట్టు యూఏఈపై కేవలం 4.3 ఓవర్లలోనే 60 పరుగులు చేసి తొలి విజయాన్ని ఆసియా కప్ లో నమోదు చేయగలింది. ఇదే దూకుడును, ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Next Story

