Fri Sep 13 2024 07:08:18 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa First Odi : బౌలర్లు.. బ్యాటర్లు ఏం ఆడారు... ఇరగదీశారు బాసూ
టీం ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించింది
టీం ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించింది. టీ 20 సిరీస్ ను సమం అయినా ఇప్పుడు వన్డేలలో మాత్రం టీం ఇండియా మాత్రం పైచేయి సాధించింది. అతి తక్కువ పరుగులకే దక్షిణాఫ్రికాను అవుట్ చేయడంతో అప్పుడే టీం ఇండియా విజయం ఖాయమయిందనే చెప్పాలి. 27 ఓవర్లకే 116 పరుగులకు దక్షిణాఫ్రికా అవుట్ కావడంతో భారత్ విజయం ఇక నల్లేరు మీద నడకేనని అందరికీ అర్థమయింది.
బౌలర్లు సత్తా చాటగా...
అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వెన్ను విరిచాడు. ఇక అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. భారత్ బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా తొలి వన్డేలో పేలవమైన ప్రదర్శన చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ మూడు గంటల్లోనే ముగిసింది. వన్డే మ్యాచ్ టీ 20ని తలపించిందనే చెప్పాలి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి నుంచే పతనం ప్రారంభమయిన పరిస్థితుల్లో బ్యాటర్లు చేతులెత్తేశారు. అందరూ వరసపెట్టి అవుట్ కావడంతో భారత్ ఫ్యాన్స్ ఆనందంతో గంతులేశారు.
బ్యాటర్లు పూర్తి చేయగా...
ఇక 117 టార్గెట్ తో బరిలోకి దిగిన టీం ఇండియా ఆదిలోనే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయింది. అయితే సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ స్కోరును పెంచారు. అయితే శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు వద్ద అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత తిలక్ వచ్చి మిగిలిన టార్గెట్ పూర్తి చేశాడు. ఫస్ట్ వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో 1 -0 గా భారత్ అగ్రభాగాన నిలిచింది.
Next Story