Fri Dec 05 2025 15:28:38 GMT+0000 (Coordinated Universal Time)
Ind Vs Eng Third Test : మూడో టెస్ట్ ఎవరి వైప మొగ్గుతుందో? ఇరు జట్లదీ మంచి ప్రదర్శనే
ఇండియా - ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ లో టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లను చాలా వరకూ కట్టడి చేయగలిగింది.

ఇండియా - ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ లో టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లను చాలా వరకూ కట్టడి చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సొంత మైదానంలో తొలి రోజు కొంత అవస్థలయితే పడ్డారు. అయితే ఇంగ్లండ్ కూడా బ్యాటింగ్ పరంగా పరవాలేదనిపించింది.భారత్ కూడా అదే సమయంలో వెంటవెంటనే వికెట్లు తీయగలడంతో తక్కువ పరుగులకే నాలుగు వికెట్లు తీయగలిగింది. ఈరోజు కనుక భారత్ బౌలర్లు మరింతగా రాణించగలిగితే మాత్రం ఇంగ్లండ్ ను తక్కువ పరుగులకే ఆల్ అవుట్ చేసే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ బ్యాటర్లు నెమ్మదిగా ఆడటంతో స్కోరు కూడా వేగం తగ్గింది. అయితే భారత్ ను కలవరపర్చే విషయం ఏంటంటే రిషబ్ పంత్ గాయంతో మైదాన్ని వీడటం. మూడోటెస్ట్ లో మాత్రం తొలి మొదటి, రెండో టెస్ట్ ల మాదిరిగా పరుగుల జోరు లేదు.
నిదానంగా ఆడుతూ...
లీడ్స్ , బర్మింగ్ హామ్ ల పిచ్ లకు విరుద్థంగా లార్డ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఆచి తూచి ఆడుతుండటంతో వికెట్ తీయడం కూడా భారత్ బౌలర్లకు కష్టంగా మారింది. ఇంగ్లండ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 251 పరుగుల చేయగలిగింది. ఇంగ్లండ్ పరంగా చూస్తే ఇది సంతృప్తికరమైన స్కోరే. అలాగే భారత్ బౌలింగ్ పరంగా చూసినా తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ వికెట్లు అందిపుచ్చుకున్నట్లే. జోరూట్ మాత్రం 99 పరుగులతో ఇంగ్లండ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడగా, స్టోక్స్ కూడా 39 స్కోరుతో ఇంకా క్రీజులోనే ఉన్నాడు. పోప్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. మూడో మ్యాచ్ లో ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టిన టీం ఇండియా నితీష్ కుమార్ ను ఆడించింది.
తెలుగులో గిల్...
అంచనాలకు తగ్గినట్లుగానే నితీష్ కుమార్ ఒకే ఓవర్ లో రెండు కీలకమైన వికెట్లు తీయగలిగాడు. ఓపెనర్లుబెన్ డకెట్, జాన్ క్రాలీ వికెట్లను తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనడం ఇంగ్లండ్ బ్యాటర్లకు కష్టమయింది. జడేజా పోప్ వికెట్ తీయడంతో మూడో వికెట్ పడింది. బ్రూక్ ను బుమ్రా బౌల్ట్ చేయడంతో మరో వికెట్ చేతికి చిక్కింది. భారత్ ఈరోజు బౌలింగ్ పరంగా రాణిస్తే తక్కువ పరుగులకే ఇంగ్లండ్ ను అవుట్ చేసి ఆ మ్యాచ్ పై పట్టు బిగించే అవకాశాలున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కెప్టెన్ శుభమన్ గిల్ నితీష్ కుమార్ ను మెచ్చుకుంటూ బాల్ రా.. మామా.. అని ఒకసారి.. బాగుంది రా.. మామా అని మరొకసారి తెలుగులో అనడం స్టంప్ మైక్ లో వినిపించాయి. నితీష్ కుమార్ రెడ్డిని గిల్ తెలుగులోనే మెచ్చుకోవడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
Next Story

