Mon Mar 16 2026 04:25:57 GMT+0530 (India Standard Time)
టీం ఇండియా క్రికెటర్ ఇంట విషాదం
టీం ఇండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ ఇంట విషాదం నెలకొంది. ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ ఈరోజు మరణించారు

టీం ఇండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ ఇంట విషాదం నెలకొంది. ఉమేష్ యాదవ్ తండ్రి మరణించారు. ఆయన తండ్రి తిలక్ యాదవ్ ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తిలక్ యాదవ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను ఆసుపత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్యం విషమించడంతో...
కానీ ఈరోజు ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించారని వైద్యులు తెలిపారు. దీంతో టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. తిలక్ యాదవ్ మరణంపై పలువురు క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు సంతాపాన్ని ప్రకటించారు. ఉమేష్ కు సానుభూతిని వ్యక్తం చేశారు.
Next Story

