Fri Dec 05 2025 14:18:52 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England Fourth Test : నాలుగో టెస్ట్ లో భారత్ తుది జట్టులో చోటెవరికి?
మాంచెస్టర్ లో జరిగిన ఇండియా - ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ కు టీం ఇండియా ప్రాక్టీస్ ప్రారంభించింది

మాంచెస్టర్ లో జరిగిన ఇండియా - ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ కు టీం ఇండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే తుది జట్టులో ఎవరు ఉంటారన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే తీసివేతలు, చేర్పులపై మాత్రం అంచనాలు వినపడుతూనే ఉన్నాయి. మాజీ క్రీడాకారులు కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్ పై తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ఖచ్చితంగా ఆడించాల్సిన వారి పేర్లను కూడా చెబుతున్నారు. అలాగే జట్టు నుంచి తప్పించిన వారి పేర్లను నేరుగా చెబుతున్నారు. ఎందుకంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో గెలుపు ఇండియాకు అవసరం కావడంతో మాజీ టీం ఇండియా క్రికెటర్లు సయితం తమ సూచనలను బీసీసీఐకి అందచేస్తున్నారు.
కరుణ్ నాయర్ ను తప్పించి...
ప్రధానంగా కరుణ్ నాయర్ ను తప్పించాలన్న డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. వరసగా మూడు మ్యాచ్ లలో ప్రదర్శన సరిగా చేయకపోవడంతో కరుణ్ నాయర్ ను పక్కన పెట్టాలని కోరుతున్నారు. కరుణ్ నాయర్ ను తప్పించి అతని స్థానంలో సాయి సుదర్శన్ ను తీసుకు రావాలని ఎక్కువ మంది మాజీ క్రికెటర్లు కూడా చెబుతున్నారు. నాలుగో టెస్ట్ మ్యాచ్ కీలకం కావడంతో ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందనేని గట్టిగానే చెబుతున్నారు. వరసగా విఫలమయిన వారిని పక్కనపెట్టి కొత్త వారిని ఎంపిక చేయడంలో తప్పేమీ లేదని కూడా అంటున్నారు. అయితే సీనియర్ మాజీ క్రికెటర్ల ఆలోచనలను బీసీసీఐ అమలు పర్చేందుకు కూడా సిద్ధమవుతుంది.
నితీష్ కుమార్ ను కూడా...
మరొక వైపు నితీష్ కుమార్ రెడ్డిని కూడా పక్కన పెట్టి అతని స్థానంలో కులదీప్ యాదవ్ ను తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినపడుతుంది. నితీష్ కుమార్ రెడ్డి కొన్నివికెట్లు తీసినప్పటికీ పరుగులు చేయడంలేదు. దీంతో పాటు నితీష్ కుమార్ రెడ్డి గాయాలపాలు కావడంతో ఆయన స్థానంలో అన్షుల్ కాంబోజ్ ను తీసుకునే అవకాశముంది. ఆల్ రౌండర్ అని జట్టులోకి తీసుకున్నప్పటికీ వేగంగా వికెట్లు తీయలేకపోతున్నాడని, అందులో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాలన్నా, వేగంగా వికెట్లు అంది పుచ్చుకోవాలన్నా, పాతుకుపోయిన వారి భాగస్వామ్యాన్నివిడదీయాలన్నాకులదీప్ యాదవ్ ను ఆడించాలని హర్బజన్ సింగ్ లాంటి వాళ్లు బీసీసీఐకి చెబుతున్నారు. కులదీప్ యాదవ్ బంతి మ్యాజిక్ కు ఖచ్చితంగా ఇంగ్లండ్ బ్యాటర్లు బోల్తాపడక తప్పదని చెబుతున్నారు. జడేజాకు తోడుగా కులదీప్ యాదవ్ ఉంటే అదనపు బలం అని విశ్లేషిస్తున్నారు. మరి బీసీసీఐ ఏంచేస్తున్నదన్నది చూడాల్సి ఉంది
Next Story

