Fri Jan 30 2026 17:32:24 GMT+0000 (Coordinated Universal Time)
టీ20 ప్రపంచకప్: శ్రీలంకకు షాకిచ్చిన నమీబియా..!

ఆసియా కప్ ను గెలిచి జోరు మీద ఉన్న శ్రీలంకకు ప్రపంచ కప్ లో నమీబియా షాకిచ్చింది. మెయిన్ గ్రూప్ లోకి రావాలంటే ఖచ్చితంగా గ్రూప్ స్టేజ్ ను దాటాల్సి ఉండగా.. నమీబియా శ్రీలంకకు ఊహించని షాక్. ఐసీసీ ప్రపంచ కప్-2022 లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఏకంగా 55 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 164 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసియా కప్ ఛాంపియన్ కేవలం 108 పరుగులకే ఆలౌటయ్యారు. అసోసియేట్ టీమ్ సాధించిన గొప్ప విజయంలో ఇదొకటిగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లిఫ్టన్ ఈటన్(20 పరుగులు), బార్డ్ (26 పరుగులు), ఎరాస్మస్(20 పరుగులు), ఫ్రైలింక్ (44 పరుగులు), స్మిట్ (31 పరుగులు) తో రాణించడంతో నమీబియా మంచి స్కోరును సాధించగలిగింది. ఛేజింగ్ లో శ్రీలంక చేతులు ఎత్తేసింది. 108 పరుగులకు ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దసున్ శనక(29 పరుగులు), భానుక రాజపక్ష (20పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. నమీబియా బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది.
Next Story

