Mon Feb 02 2026 06:27:40 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : వరల్డ్ కప్ లో భారత్ విజయావకాశాలు ఎన్నంటే?
టీ20 వరల్డ్ కప్ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది

టీ20 వరల్డ్ కప్ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. సొంత గడ్డమీద ఐదు టీ20ల సిరీస్ ను న్యూజిలాండ్ పై 4 -1 తో కైవసం చేసుకున్నటీం ఇండియా రెట్టించిన ఉత్సాహంతో్ వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టబోతుంది. వరల్డ్ కప్ కు ముందు మంచి ప్రిపరేషన్ మ్యాచ్ లను న్యూజిలాండ్ భారత్ కు అందించినట్లయింది. విశాఖ టీ 20 కూడా గెలిచేది కానీ వరల్డ్ కప్ కు సన్నద్థత కోసం కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల ఆ మ్యాచ్ మిస్ అయింది. ఇప్పుడు కాలరెగరేస్తూ వరల్డ్ కప్ లోకి టీం ఇండియా ఎంట్రీ ఇస్తుంది.
న్యూజిలాండ్ తో జరిగిన...
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భారత్ జట్టులో ఎవరి బలాలు, ఎవరి బలహీనతతేలంటో తెలిసొచ్చాయి. ప్రధానంగా ఫీల్డింగ్ లో కొంత మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. వరల్డ్ కప్ కు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. అదీ భారత్ లోనే జరుగుతుండటం కొంత భారత్ కు కలసి వచ్చే అంశంగానే చూడాలి. అభిషేక్ శర్మ, ఇషాన్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్ లు సత్తా చాటారు. ఇక తిలక్ వర్మ ఎంట్రీతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడుతుంది.
బౌలింగ్ బ్యాటింగ్ లో....
బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, హార్థిక్ పాండ్యా వికెట్లను సరైన సమయంలో అందిపుచ్చుకుంటున్నారు. ఇక ఆల్ రౌండర్ గా శివమ్ దూబె, అక్షర్ పటేల్ లు తమ పాత్రను పోషించనున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉన్నప్పటికీ కొంత ఫీల్డింగ్ పరంగానే మెరుగుపడాల్సి ఉంటుందన్నవిశ్లేషణలు వినపడుతున్నాయి. ఈ టోర్నీకి బంగ్లాదేశ్ దూరం కావడంతో ఇక ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈ నెల 15 వ తేదీన కొలొంబో వేదికగా భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 7వ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. భారత్ తో పాకిస్తాన్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ మ్యాచ్ జరిగేది అనుమానంగానే ఉంది. అయినా మ్యాచ్ ఆడేందుకు టీం ఇండియా కొలంబో బయలుదేరి వెళ్లనుంది.
వరల్డ్ కప్ లో భారత్
ఫిబ్రవరి 7 : భారత్ vs యూఎస్ఏ (వాంఖడే స్టేడియం ముంబయి)
ఫిబ్రవరి 12 : భారత్ vs నమీబియా (అరుణ్ జైట్లే స్టేడియం, ఢిల్లీ)
ఫిబ్రవరి 15 : భారత్ vs పాకిస్తాన్ (ప్రేమదాస స్టేడియం, కొలొంబో)
ఫిబ్రవరి 18 : భారత్ vs నెదర్లాండ్స్, (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)
Next Story

