Wed Feb 18 2026 10:27:26 GMT+0530 (India Standard Time)
T20 World Cup : నేడు భారత్ - నెదర్లాండ్ మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ - నెదర్లాండ్స్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగనుంది.

టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ - నెదర్లాండ్స్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు చేరుకున్న టీం ఇండియా ఈ మ్యాచ్ కేవలం నామమాత్రమే. అయినప్పటికీ భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ప్రధానంగా తర్వాత మ్యాచ్ కు సన్నద్ధంగా ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది.
పసి కూన కాదు...
మరొకవైపు అభిషేక్ శర్మ వంటి వారు ఈ మ్యాచ్ నుంచి కొంత తిరిగి పుంజుకోవాలంటే ఇది సరైన అవకాశమని భావిస్తున్నారు. మరొకవైపు నెదర్లాండ్స్ జట్టు కూడా ఆల్ రౌండర్లతో ఉంది. పసికూన మాత్రం కాదు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. మంచి పోటీ ఇచ్చే జట్టు అని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. నెదర్లాండ్స్ పాక్ జట్టుకు చెమటలు పట్టించింది. అందుకే ఈ మ్యాచ్ లో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.
Next Story

