Sun Mar 08 2026 11:22:03 GMT+0530 (India Standard Time)
T20 World Cup Finals : భీకర పోరు.. ఎన్నో సెంటిమెంట్లు.. ఎన్నో లెక్కలు.. నేడు భారత్ - న్యూజిలాండ్ ఫైనల్స్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఫైనల్స్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఫైనల్స్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి. రెండు జట్లు కొంత తడబడుతూ ఓటములను చూవి చూస్తూ ఫైనల్స్ కు చేరుకున్నాయి. గ్రూప్ దశలో భారత్ అన్ని మ్యాచ్ లో గెలిచి సూపర్ 8 మ్యాచ్ లలో సౌతాఫ్రికాపై ఓటమి చెంది తర్వాత తేరుకుని వెస్టిండీస్ పై గెలిచి సెమీ ఫైనల్స్ కు, ఇంగ్లండ్ పై గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది. న్యూజిలాండ్ మాత్రం కొన్ని మ్యాచ్ లలో ఓటమిని చవి చూసి పాకిస్తాన్ నుశ్రీలంక ఓడించడంతో లక్కుతో రన్ రేట్ తో సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టి దక్షిణాఫ్రికాపై దంచికొట్టి మరీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. అంటే రెండు జట్లు లోపాలున్నాయి. బలాలున్నాయి. అందుకే ఈ మ్యాచ్ గెలుపు నీదా? నాదా? అన్నట్లు రీతిలో సాగనుంది.
రెండు జట్లలో...
టీం ఇండియా బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తున్నప్పటికీ ఒకింత ఆందోళన మాత్రం ఉంది. సంజూ శాంసన్ మాత్రం వరసగా రెండు మ్యాచ్ లలో భారీ పరుగులు సాధించి భారత్ విజయానికి కారణమయ్యాడు. అభిషేక్ శర్మ మాత్రం పేలవ ప్రదర్శన కంటిన్యూ అవుతుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా ఆడటం లేదు. త్వరగా అవుటయి నిరాశపరుస్తున్నాడు. ఇక ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబేలో మాత్రం దూకుడుగానే ఆడుతూ భారీ స్కోరు సాధించేందుకు దోహదం చేస్తున్నారు. న్యూజిలాండ్ లో అలైన్ సెమీఫైనల్స్ లో ఆడిన ఆట చూసిన వారికి ఎవరికైనా అతను ప్రమాదకారి అని భావించక తప్పదు. న్యూజిలాండ్ బ్యాటింగ్ పరంగా కూడా బలంగానే కనిపిస్తుంది.
టాస్ కీలకం...
ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం అంటే సెంటిమెంట్ గుర్తుకు వచ్చి భయమేస్తుంది. 2023 నుంచి ఐసీసీ టోర్నమెంట్లలో రెండు మ్యాచులు ఓడింది అక్కడే. అదే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు టీమ్ ఇండియా అభిమానులకు స్టేడియం సెంటిమెంట్ టెన్షన్ పట్టుకుంది. ఫైనల్స్ జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో ఐసీసీ టోర్నమెంట్లలో టీం ఇండియాకు అంత రికార్డు లేదు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని భారత్ అహ్మదాబాదులో జరిగిన ఫైనల్స్ లో కంగుతిని కప్పు కోల్పోయింది.తాజా వరల్డ్ లో సౌతాఫ్రికాపై 76 రన్స్ తేడాతో ఓడిపోయిందీ అక్కడే. అయితే న్యూజిలాండ్ కు కూడా ఈ స్టేడియంలో గణాంకాలు అనుకూలంగా లేవు. పిచ్ మాత్రం 200 పరుగులు చేసే వీలుంటుందని అంచనాలు విన పడు తున్నాయి. 200 పరుగులకు పైన చేసిన జట్టు కప్పు కైవసం చేసుకుంటుంది. మరి ఇక్కడ మరో సెంటిమెంట్ కూడా ఉంది. ముందు బ్యాటింగ్ చేసిన వాళ్లే ఎక్కువసార్లు విజయం సాధించారు. అందుకే టాస్ కూడా కీలకం.
Next Story

