Thu Mar 19 2026 13:50:28 GMT+0530 (India Standard Time)
నేడు న్యూజిలాండ్ తో భారత్ తొలి టీ20 మ్యాచ్
నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య టీ 20 మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది

ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లో ఓటమి పాలయిన ఇండియా తర్వాత న్యూజిలాండ్ పర్యటన చేస్తోంది. నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య టీ 20 మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ , న్యూజిలాండ్ లు ప్రపంచకప్ లో సెమి ఫైనల్స్ నుంచి ఇంటి దారి పట్టిన నేపథ్యంలో ఈ సిరీస్ ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు జట్లు బలమైనవే. బౌలింగ్, బ్యాటింగ్ లలో బలంగా ఉన్నాయి. భారత్ మొత్తం మూడు టీ 20 మ్యాచ్ లను న్యూజిలాండ్ తో ఆడనుంది.
భారీ మార్పులతో...
భారత్ జట్టులో భారీ మార్పులు చేసింది. హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు విశ్రాంతి నిచ్చింది. వైెస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను నియమించింది. ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశముంది. శుభమన్ గిల్, సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లకు చోటు కల్పించింది. రెండు జట్లు బలంగా ఉండటంతో ఆట రసవత్తరంగా సాగే అవకాశముంది.
- Tags
- india
- new zealand
Next Story

