Thu Jul 17 2025 00:22:53 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేడు ఐపీఎల్ లో బెంగళూరు vs హైదరాబాద్
నేడు ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ఇక త్వరలోనే ప్లే ఆఫ్ రేసు మొదలవుతుంది. ప్లే ఆప్ కు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. నాలుగు జట్లు మంచి ఊపు మీద ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో అన్ని జట్లు పెర్ ఫార్మెన్స్ బాగా చూపుతున్నాయి. అన్ని జట్లను ఓడిస్తూ రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్ లో ఈ నాలుగు జట్లు చివరకు ప్లే ఆఫ్ రేసుకు చేరుకున్నాయి. దీంతో ప్లే ఆఫ్ రేసు మంచి ఉత్కంఠను రేపుతుంది.
నేడు మరో ముఖ్యమైన మ్యాచ్...
నేడు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరగనుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుకు చేరుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ప్లేఆఫ్ రేసు చేరుకోలేక చివరి స్థానంలో సరిపెట్టుకుంది. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రమయినా గెలుపు కోసం మాత్రం పోటీ జరుగుతుంది.
Next Story