Mon Apr 13 2026 10:04:19 GMT+0530 (India Standard Time)
IPL 2026 : ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పోరాడనుంది.

ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పోరాడనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఇరుజట్లలో రాజస్థాన్ రాయల్స్ కు ఇప్పటి వరకూ ఓటమి లేదు. హైదరాబాద్ జట్టు మాత్రం గెలుపులకన్నా ఓటములే ఎక్కువగా నమోదు చేసుకుంది.
రాయల్స్ దే పై చేయి...
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో ఓడి ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. దీంతో హైదరాబాద్ తన సొంత వేదికపై సత్తా చూపేందుకు సన్ రైజర్స్ తహతహలాడుతుంది. కానీ రాజస్థాన్ ను ఈ సీజన్ లో తట్టుకోవడం అంత సులువు కాదేమో.
Next Story

