Sun Apr 05 2026 22:22:53 GMT+0530 (India Standard Time)
IPL 2026 : హైదరాబాద్ లో సన్ రైజర్స్ ఓటమి.. లక్నో కు విజయం
హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ పై ఓటమి పాలయింది

హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ పై ఓటమి పాలయింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లోని టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే తన ఇన్నింగ్స్ ను ముగించింది. ఇరవై ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది.
టాప్ ఆర్డర్ మొత్తం...
టాప్ ఆర్డర్ మొత్తం విఫలమయింది. క్లాసెన్ అరవై రెండు, నితీశ్ కుమార్ రెడ్డి 56 పరుగులు చేసి రాణించడంతోనే ఆ స్కోరు అయినా చేయగలిగింది. ఇరవై ఓవర్లకు కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ లు ముగ్గురు తలో రెండు వికెట్లు తీసి హైదరాబాద్ ను అత్యధిక పరుగులు చేయకుండా కట్టడి చేయగలిగారు.
చేదనలో కష్టపడి...
తర్వాత ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. మార్ష్, కెప్టెన్ రిషబ్ పంత్ లు నిలబడి కొంత ఆటను తమ వైపునకు తిప్పే ప్రయత్నం చేశారు. రిషబ్ పంత్ అరవై ఎనిమిది, మార్ష్ నలభై ఐదు పరుగులు చేసి అవుటయ్యాడు. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ క్రీజులో పెద్దగా నిలవలేదు. బదోని, పూరన్ లు పెద్దగా పరుగులు చేయకుండానే వెనుదిరిగారు. రిషబ్ పంత్ ఒక్కడే చివరి వరకూ పోరాడారు. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు 9 బాల్స్ కు 9 పరుగులు చేయాల్సి వచ్చింది. అయినేా విజయం లక్నోకే సొంతమయింది. పంత్ వల్లనే ఈ మ్యాచ్ లక్నో గెలిచింది.
Next Story

