Fri Jun 20 2025 10:47:48 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : అత్యంత పేలవంగా ఆరెంజ్ ఆర్మీ.. ఇది కోలుకునే పరిస్థితి లేనట్లుందిగా?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడగా అందులో రెండింటిలో మాత్రమే గెలిచింది

ఐపీఎల్ లో ఈ సీజన్ లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమే. రెండు జట్లు మంచి అంచనాలతో దిగినవే. కానీ ఏం లాభం? ఏ మ్యాచ్ లోనూ విజయం సాధించలేకపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఇప్పటి వరకూ గెలుపు అనేది తెలియకుండా ఐపీఎల్ సీజన్ ముగించే పరిస్థితుల్లో ఉంది. పేరుకు మంచి బ్యాటర్లు, బౌలర్లున్నప్పటికీ ఆ జట్టు మాత్రం ఇక కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
రెండింటిలో గెలిచి...
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడగా అందులో రెండింటిలో మాత్రమే గెలిచింది . ఆరింటిలో ఓటమి పాలయింది. తొలి రెండు మ్యాచ్ లో గెలిచిన వెంటనే గత సీజన్ ను గుర్తుకు తెచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ దానికి అంత సీన్ లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక ఆ తర్వాత మ్యాచ్ నుంచి వరస ఓటములు. తేరుకోలేక తడబడుతుంది. ఐపీఎల్ సీజన్ లో మూడు వందల పరుగుుల చేస్తుందని భావించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కనీస పరుగులు కూడా చేయలేక సతమతమవుతుంది.
ఈ జట్టును చూసిన వారికెవరికైనా...?
దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజ్ ఓనర్ కావ్య పాప ఇక వీరిని వదిలించుకుంటేనే బెటర్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తం జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఉప్పల్ మైదానంలో కేవలం పదమూడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును చూసిన వారికి ఎవరికైనా ఈ జట్టును వదిలించుకుంటేనే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. కావ్యపాపకు కళ్ల వెంట నీరు రావడం ఒక్కటే తక్కువ. అసలు ఈ జట్టు కొనుగోలు చేసి కావ్య ఏం చేయాలనుకున్నారని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మొత్తం కావ్య పాప వచ్చే సీజన్ నాటికైనా ఈ టీం మొత్తాన్ని తీసేసి కొత్త టీంతో ముందుకు రావడం మంచిదేమో.
Next Story