Thu Jul 17 2025 00:30:25 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : ఇంతకు ముందంతా ఏమంయిది సామీ.. కాటేరమ్మ కొడుకులు ఇలా చెలరేగిపోయారు
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించింది

ఐపీఎల్ సీజన్ లో విచిత్రాలు జరుగుతున్నాయి. చివరి క్షణంలో అంటే గెలిచినా ఉపయోగం లేని మ్యాచ్ లో మాత్రం ఊది పారేస్తున్నారు. ఈ ఫామ్ ఇంతకు ముందు ఉండి ఉంటే జట్టు యాజమాన్యానికి కాని, అభిమానులకు కానీ పండగ వాతావరణం ఉండేది. కానీ ఏం లాభం ముందంతా అన్ని మ్యాచ్ లలో ఓటమి అంటూ ఒకటే మాట వింటూ ఇక చివరి మ్యాచ్ లలో గెలిచినా ప్రయోజనం ఏముందన్న కామెంట్స్ వినపడుతున్నప్పటికీ ఆట ఆటేనని అనుకోవాలి. అందుకే గెలిచినా ఏ మాత్రం ఉపయోగం లేని మ్యాచ్ లలో గెలిచి చివరగా విజయంతో టోర్నీ నుంచి జట్లు నిష్క్రమిస్తున్నాయి. అందులో హైదరాబాద్ సన్ రైజర్స్ ఒకటి. నిన్నఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించింది.
మునుపటి ఫామ్ లోకి వచ్చినా...
తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మునుపటి ఫామ్ కనిపించింది. క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ 32 పరుగులు చేశఆడు. హెడ్ 76 పరుగులు చేసి జట్టు స్కోరు పెంచాడు. క్లాసెన్ నాటౌట్ గా నిలిచి 105 పరుగులు చేశఆడు. కిషన్ 29 పరుగులు చేశాడు. అనికేత్ నాటౌట్ గా నిలిచి 12 పరుగులు చేయగలిగాడు. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఇరవై ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక స్కోరు చేసినజట్టుగా మరోసారి హైదరాబాద్ సన్ రైజర్స్ కే ఆ క్రెడిట్ దక్కింది.
కోల్ కత్తా ఇబ్బందులతో...
ఇంత పెద్ద భారీ లక్ష్యాన్ని చేరుకోవడం కోల్ కత్తా నైట్ రైడర్స్ అందుకోవడం సాధ్యం కాదని ముందే తెలుసు. అందుకే ముందే విజయం కోల్ కత్తాదే అనుకున్నారంతా. అనుకున్నట్లే కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఛేదనలో ఇబ్బందులు పడుతూ ఓటమి పాలయింది. డీకాక్ తొమ్మిది పరుగులకే వెనుదిరగాడు. నరైన్ 31 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. రహానే పదిహేను పరుగులు చేసి అవుటయి ఉసూరుమనిపించాడు. రఘువంవీ కూడా పథ్నాలుగు పరుగులకే అవుటయ్యాడు. రింకు తొమ్మిది పరుగులు చేసి బ్యాట్ ఊపుతూ వెళ్లిపోయాడు. రసెల్ డకౌట్ తో వెనుదిరిగాడు. మనీశ్ పాండే మాత్రం 37 పరుగులు చేసి జట్టు గౌరవాన్ని పెంచాడు. దీంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో ఆల్ అవుట్ అయి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే కోల్ కత్తా నైట్ రైడర్స్‌పై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 110 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Next Story