Fri Dec 05 2025 10:30:55 GMT+0000 (Coordinated Universal Time)
సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం.. విడిపోయేందుకు
స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది.

స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. సైనా నెహ్వాల్ ఏడేళ్ల క్రితం మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ను వివాహం చేసుకుంది. ఈ మేరకు సైనా నెహ్వాల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరూ హైదరాబాద్ లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందారు.
2018లో వివాహం చేసుకున్న...
2018లో వివాహం చేసుకున్న జంట ఏడేళ్ల పాటు కాపురం సవ్యంగానే చేసుకుంది. తర్వాత వ్యక్తి గత కారణాలతో ఇద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. విడిపోయేందుకు ఇద్దరం అంగీకరించామని, ఇద్దరు భవిష్యత్ లోననూ స్నేహితులుగా కొనసాగుతామని తెలిపింది. జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుందని, చాలా రోజులు ఆలోచించిన తరువాత ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
Next Story

