Sun Dec 14 2025 04:03:05 GMT+0000 (Coordinated Universal Time)
యువతిపై క్రికెటర్ అత్యాచారం.. క్రికెటర్ అరెస్ట్
ధనుష్క అరెస్టుతో.. శ్రీలంక క్రికెట్ టీమ్ అతను లేకుండానే.. ఆస్ట్రేలియా నుండి స్వదేశానికి పయనమైంది.

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ధనుష్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధనుష్క అరెస్టుతో.. శ్రీలంక క్రికెట్ టీమ్ అతను లేకుండానే.. ఆస్ట్రేలియా నుండి స్వదేశానికి పయనమైంది. గాయం కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ కు దూరమైన ధనుష్క.. సిడ్నీలోని హోటల్ లో ఉంటున్నాడు. అదే సమయంలో అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఓ యువతి ధనుష్కపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆదివారం ఇంగ్లండ్పై జరిగిన మ్యాచ్లో ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. ధనుష్క గుణతిలక అరెస్ట్ వ్యవహారంపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు స్పందించారు. రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్ 2న క్రికెటర్ అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ధనుష్కను పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story

