Fri Sep 13 2024 08:12:57 GMT+0000 (Coordinated Universal Time)
INDvsSL: లంక బౌలర్లను చితక్కొట్టేసిన భారత బ్యాటర్లు
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా పల్లెకెలెలో
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా పల్లెకెలెలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు చితక్కొట్టారు. శ్రీలంక బౌలర్లు ఓ వైపు వికెట్లు తీస్తున్నా.. భారత బ్యాటర్లు మాత్రం బాదుకుంటూ వెళ్లిపోయారు. 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక పై భారత బ్యాటర్లు మొదటి ఓవర్ నుండి ఎదురుదాడికి దిగారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40; 21 బంతుల్లో), శుభ్మన్ గిల్ (34; 16 బంతుల్లో) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో టీమిండియా వికెట్ నష్టపోయి 74 పరుగులు చేసింది. మధ్యలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(58; 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), రిషబ్ పంత్(49) రాణించారు. ఆఖర్లో అనుకున్నంత వేగంగా భారత బ్యాటర్లు స్కోరు చేయలేకపోయారు. లంక బౌలర్లలో హసరంగా, మతీష పతిరాణ మాత్రమే రాణించారు. పతిరాణ ఏకంగా 4 వికెట్లు తీశాడు. హసరంగా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు.
Next Story