Sun Dec 14 2025 00:22:46 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa : భారత్ దారుణ ఓటమి
India vs South Africa : భారత్ దారుణ ఓటమి

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా భారత గడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. 25 ఏళ్ల తర్వాత భారత్‌లో సిరీస్‌పై దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. 549 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 140కే ఆల్ అవుట్ అయింది. జడేజా తప్పించి మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలం కావడంతో ఓటమి బాట భారత్ పట్టింది.
భారీ పరుగుల లక్ష్యంతో...
తొలిటెస్ట్ లో కేవలం ముప్ఫయి పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెండో టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించింది. ఐదో రోజు భారత్‌ను 408 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. భారత్ ముందుంచిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ ఇండియా రెండో సెషన్లో 140 రన్స్‌కే మళ్లీ వెనుదిరిగింది. దీంతో 25 ఏళ్ల తర్వాత భారత్ నేలపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
Next Story

