Tue Jan 20 2026 06:57:13 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి ఐపీఎల్ లో ఈ ఐదుగురు అదరగొడతారు : గంగూలీ
ఈ సీజన్ లో యువ ఆటగాళ్లలో పృథ్వి షా, రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుభ్ మన్ గిల్ బాగా ఆడతారని చెప్పాడు.

క్రికెట్ లవర్స్ కు మరో నెలరోజుల్లో అసలు సిసలైన పండగ మొదలుకాబోతోంది. నెలరోజుల్లో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రారంభం కానుంది. రెండు నెలలపాటు విరామం లేకుండా.. మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సీజన్ లో ఏ జట్టులో ఎవరెవరు అదరగొట్టబోతున్నారన్న దానిపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపారు.
తాజాగా ఓ షో లో పాల్గొన్న దాదా.. ఈ సీజన్ లో యువ ఆటగాళ్లలో పృథ్వి షా, రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుభ్ మన్ గిల్ బాగా ఆడతారని చెప్పాడు. ఓ షోలో పాల్గొన్న గంగూలీ.. ఈ సీజన్ లో యువ ఆటగాళ్లలో పృథ్వి షా, రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుభ్ మన్ గిల్ బాగా ఆడతారని అనుకుంటున్నట్లు తెలిపారు. "సూర్య కుమార్ యాదవ్ ను యువ ఆటగాడిగా పరిగణనలోకి తీసుకోలేం. యువ ప్లేయర్లలో పృథ్వీ షా లో ఎంతో ప్రతిభ ఉంది. రిషభ్ పంత్ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఇక రుతురాజ్ కూడా బాగా ఆడుతున్నాడు. వీళ్లు ముగ్గురు బ్యాట్స్ మన్ బాగా ఆడతారని నేను అనుకుంటున్నా. ఇక బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోతే రాణిస్తాడు." అని దాదా వివరించాడు.
Next Story

