Sun Mar 15 2026 04:25:53 GMT+0530 (India Standard Time)
Paris Olympics : గురి తప్పలేదు... మరో పతకం గ్యారంటీయేగా?
పారిస్ ఒలింపిక్స్ లో మూడు పతకాలను సాధించే దిశగా షూటర్ మను బాకర్ సిద్ధంగా ఉన్నారు

పారిస్ ఒలింపిక్స్ లో మూడు పతకాలను సాధించే దిశగా షూటర్ మను బాకర్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రెండు కాంస్య పతకాలను మనుబాకర్ కైవసం చేసుకున్నారు. తాజాగా మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ కాంపిటీషన్ లో టాప్ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించారు. ఇక శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ లో తొుత ప్రిసిషన్ రౌండ్ లో 294 పాయింట్లు సాధించి టాప్ 3లో మనుబాకర్ నిలిచారు.
రేపు ఫైనల్స్...
మొత్తంగా 590 పాయింట్లు సాధించి రెండో స్థానానికి మనుబాకర్ చేరుకున్నారు. రేపు దీనిపై ఫైనల్ పోరు జరగనుంది. ఈ పోరులో గెలిచి మను బాకర్ మరో పతకాన్ని కైవసం చేసుకుంటారని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ మనూ బాకర్. మూడో పతకాన్ని కూడా సాధిస్తే ఒలింపిక్స్ లో మూడు పతకాలను సాధించిన ఘనతను సొంతం చేసుకుంటారు.
Next Story

