Thu Mar 05 2026 11:01:28 GMT+0530 (India Standard Time)
T20 World Cup Semi Finals : నేడు ఇండియా - ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్స్
భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ జరగనుంది

భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ పై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. ఇండియా - ఇంగ్లండ్ మధ్య పోరు హై ఓల్టేజీ మ్యాచ్ గా చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లండ్ ఇప్పిటకే పటిష్టమైన స్థితిలో ఉంది. టీం ఇండియా కూడా అన్ని విభాగాల్లో పుంజుకుంది. అందులో గణాంకాలు చూస్తే టీ20లలో ఇంగ్లండ్ కంటే ఇండియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి.
ఇంగ్లండ్ ను తక్కువగా...
ఇంగ్లండ్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. అయితే భారత్ బౌలింగ్ పరంగా కూడా పటిష్టంగా ఉంది. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్ వంటి వారితో బలంగానే ఉంది. బ్యాటింగ్ పరంగా కూడా అభిషేక్ శర్మ సక్సెస్ అయితే చాలు.. ఇక ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు కనిపించినట్లేనని అనుకోవాలి. అందుకు అభిషేక్ శర్మ కొం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. ఇండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండటం కొంత సానుకూల అంశంగానే చూడాలి.
ఎవరిది పై చేయి అన్నది...
2022లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలయిన భారత్ 2024 లో గెలిచి వరల్డ్ కప్ ఛాంపియన్ గా గెలిచింది. ఇంగ్లండ్ వరసగా ఐదు మ్యాచ్ లు గెలిచి మంచి ఫామ్ లో ఉండటం కొంత ఆ జట్టుకు కలసి వచ్చే అంశమైనా.. సెమీ ఫైనల్స్ లో ఆ జట్టు కొంత ఒత్తిడికి లోనవుతుందన్నది వాస్తవం. ఇక ఇంగ్లండ్ కు స్పిన్నర్లు బలంగా కనిపిస్తున్నారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ లు ఈవరల్డ్ కప్ లో అద్భుతమైన ఆటతీరు కనిపించారు. కానీ సెమీ ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారన్నది పాత విజయాలను, అపజయాల లెక్కలు పనిచేయవు. ఈరోజు ఏం జరగనుందీ? ఎవరిది పై చేయి అన్న దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.
Next Story

