Fri Dec 05 2025 17:52:24 GMT+0000 (Coordinated Universal Time)
వేలంలో భారీ ధర పలికిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో ఏకంగా 8 లక్షల రూపాయలు దక్కించుకున్నాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో ఏకంగా 8 లక్షల రూపాయలు దక్కించుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది. సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ నాలుగు లక్షలు పలికాడు. ఆర్యవీర్ కంటే ముందే వేదాంత్ పేరు వేలంలోకి వచ్చినా మొదట కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆఖర్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనడానికి ముందుకు వచ్చింది. కోహ్లీ అన్నకొడుకు ఆర్యవీర్ లక్ష రూపాయలకు అమ్ముడుపోయాడు.
వేలంలో సిమర్జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ అతడి కోసం ఏకంగా 39 లక్షలు వెచ్చించింది. నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. 34 లక్షల ధరకు అమ్ముడుపోయాడు.
Next Story

