Sun Dec 14 2025 00:22:12 GMT+0000 (Coordinated Universal Time)
India Vs South Africa : రెండో టెస్ట్ ఎవరికి అనుకూలం? క్రీడానిపుణులు ఏమంటున్నారంటే?
భారత్ - సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది

భారత్ - సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ కు కీలకం. కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా ముప్ఫయి పరుగులతో విజయం సాధించింది. దీంతో టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యతతో దక్షిణాఫ్రికా నిలిచింది. సిరీస్ ను సమం చేయాలంటే భారత్ గౌహతి మైదానంలో గెలిచి తీరాలి. అయితే భారత జట్టు కొంత ఒత్తిడిలో ఉంది. ఆ ఒత్తిడిని అధిగమించి విజయం దిశగా అడుగులు వేయాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
గిల్ వచ్చినా...
రెండో టెస్ట్ కు శుభమన్ గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. అలాగే శుభమన్ గిల్ గాయం నుంచి కోలుకుని గౌహతి బయలుదేరి వెళుతున్నాడని మాత్రం బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. అంటే చివరి నిమిషంలో శుభమన్ గిల్ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాగని ఆడతారని కూడా నమ్మకం లేదు. వెంటనే వన్డే సిరీస్ ఉండటంతో ఈ టెస్ట్ మ్యాచ్ కు విశ్రాంతి ఇవ్వాలన్న యోచన కూడా జట్టు యాజమాన్యం చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. మరొకవైపు యశస్వి జైశ్వాల్ ఫామ్ లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
గౌహతి పిచ్ పై కూడా...
గౌహతి పిచ్ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా వాటిని కొట్టిపారేస్తున్నారు. గౌహతి పిచ్ ఎక్కువగా పేస్, బౌన్స్ జనరేట్ అయ్యే అవకాశముందనిచెబుతన్నారు. పిచ్ లో టర్న్ ఉంటుందని చెబుతన్నారు. వేగంతో పాటు బౌన్స్ కూడా ఉండటంతో భారత బౌలర్లకు మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా బౌలర్లకు కూడా అనుకూలంగానే ఉండొచ్చు.అదే సమయంలో భారత బ్యాటర్లు నిలదొక్కుకుని ఆడాల్సి ఉంటుంది. అలాగే టాస్ కూడా ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు. మరి రెండో మ్యాచ్ లో గెలుపు కోసం భారత్ పరితపిస్తుంది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని దక్షిణాఫ్రికా తపన పడుతుంది. చివరకు ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
Next Story

