Thu Mar 19 2026 13:53:17 GMT+0530 (India Standard Time)
న్యూజిలాండ్ తో నేడు భారత్ ఢీ
భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్ డ్రాగా ముగియడంతో రెండో టెస్ట్ లోనైనా విజయం సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇప్పటికే టీ 20 సిరీస్ ను స్వీప్ చేసిన భారత్ టెస్ట్ ను కూడా తమ సొంతం చేసుకోవాలని భావిస్తుంది. న్యూజిలాండ్ కూడా ఈ టెస్ట్ లో గెలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తుంది.
పై చేయి సాధించాలని....
టీం ఇండియాపై పై చేయి సాధించాలన్న దూకుడు న్యూజిలాండ్ టీమ్ లో కన్పిస్తుంది. ఈ టెస్ట్ లో విరాట్ కొహ్లి ఆడనున్నారు. తొలి టెస్ట్ లో విశ్రాంతి తీసుకున్న కొహ్లి రెండో టెస్ట్ కు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ముంబయి వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. విరాట్ జట్టులోకి రానుండటంతో పుజారా, రహేనాలలో ఒకరిని తప్పించే అవకాశముంది.
- Tags
- new zealand
- india
Next Story

