Fri Dec 05 2025 15:55:55 GMT+0000 (Coordinated Universal Time)
India Vs South Africa : ఇండియా ఫస్ట్ బ్యాటింగ్.. రెండో టీ 20 మ్యాచ్
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా చేయనుంది. భారత్ బ్యాటర్లు విజృంభించి ఆడాల్సి ఉంది. భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచాలి. తొలి టీ 20 మ్యాచ్ తరహాలోనే రెండు వందలకు పైగా పరుగులు సాధించగలిగితేనే దక్షిణాఫ్రికాపై ఒకరకమైన ఒత్తిడి తెచ్చినట్లవుతుంది.
బ్యాటర్లు దూకుడుగానే కాకుండా...
ఓపెనర్లుగా దిగుతున్న అభిషేక్ శర్మ కొంత దూకుడుగా ఆడుతున్నప్పటికీ నిలకడగా ఆడాలని భారత్ అభిమానులు కోరుతున్నారు. తొలి టీ 20 మ్యాచ్ ను 61 భారీ పరుగుల తేడాతో ఇండియా గెలవడంతో రెండో టీ 20 మ్యాచ్ లోనూ ఫ్యాన్స్ అదేరకమైన గెలుపును కోరుకుంటున్నారు. తిలక్ వర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాటర్లు కూడా ఈ మ్యాచ్ లో రాణించగలిగితే భారత్ భారీ పరుగులు సాధించినట్లే.
Next Story

