Sat Dec 07 2024 23:58:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రెండో టీ 20 సిరీస్ పై భారత్ ?
భారత్ - వెస్టిండీస్ ల మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.
భారత్ - వెస్టిండీస్ ల మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. కోలకత్తా వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. ఇప్పటికే వన్డే సిరీస్ లో వైట్ వాష్ చేసిన భారత్ టీ 20 సిరీస్ ను కూడా వైట్ వాష్ చేయాలని ప్రయత్నిస్తుంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వైట్ వాష్ చేసి భారత్ తన సత్తా చాటాలనుకుంటోంది.
వెస్టిండీస్ జట్టులో....
రోహిత్ సేన ఇటు బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. దీంతో విండీస్ యువ ఆటగాళ్లు వికెట్లు తీయాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ ఈ మ్యాచ్ ను గెలిచి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తుంది. మొన్నటి జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా దిగాలని వెస్టిండీస్ భావిస్తుంది. భారత్ జట్టు నుంచి గాయాల కారణంగా వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్ లను పక్కన పెట్టే అవకాశముంది.
Next Story