Sat Dec 06 2025 02:11:33 GMT+0000 (Coordinated Universal Time)
India vs Afghanistan : నేడు కీలక మ్యాచ్ .. సిరీస్ ను సొంతం చేసుకుంటారా?
నేడు ఇండియా - ఆప్ఘనిస్తాన్ రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లో జరగనున్న ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ సొంతం అయినట్లే

నేడు ఇండియా - ఆప్ఘనిస్తాన్ రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతం అయినట్లే. ఇప్పటికే తొలి టీ 20 మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ 1 - 0 ఆధిక్యంతో నిలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ప్రారంభమయిన ఈ మ్యాచ్లలో ఇప్పటి వరకూ భారత్ దే పై చేయి అయింది. తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు విఫలమయ్యారు. బౌలర్లు సక్సెస్ కావడంతోనే విజయం సాధ్యమయింది.
స్వల్ప మార్పులతో...
అయితే రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. విరాట్ కొహ్లి ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. కొహ్లి రావడంతో శుభమన్ గిల్ ను పక్కన పెట్టే అవకాశముంది. యశస్వి గాయం నుంచి కోలుకుంటే ఓపెనర్ గా రోహిత్ శర్మతో దిగే అవకాశాలున్నాయి. కుల్దీప్ యాదవ్ ను ఈ మ్యాచ్ లో ఆడించనున్నారు. రవి బిష్ణోయ్ ను పక్కన పెట్టనున్నారు. ఈ మ్యాచ్ తో ముగిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఆప్ఘనిస్తాన్ కూడా ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేసి ఫైనల్ మ్యాచ్ లో పోరాడాలని కసిగా ఉంది.
Next Story

