Sun Feb 01 2026 17:08:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రెండో వన్డే... హోరాహోరీ
భారత్ - వెస్టండీస్ ల మధ్య రెండో వన్డే నేడు అహ్మదాబాద్ లో జరగనుంది.

భారత్ - వెస్టండీస్ ల మధ్య రెండో వన్డే నేడు అహ్మదాబాద్ లో జరగనుంది. ఇప్పటికే ఒక వన్డేలో విజయం సాధించిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకునేందుకు ఈ రెండో వన్డేపై దృష్టి పెట్టింది. ఈ వన్డేను గెలుచుకుంటే సిరీస్ ను గెలుచుకున్నట్లే. ఇప్పటికే 1- 0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ వన్డేను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఈ వన్డేపై వెస్టండీస్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది.
సిరీస్ గెలిచేందుకు....
ఈ రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ ను సమం చేసినట్లవుతుందని, మరో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకోవాలన్న వ్యూహంతో ఉంది. యువ ఆటగాళ్లతో వెస్టండీస్ కొంత తడబడుతుంది. భారత్ జట్టులో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. కెఎల్ రాహుల్ రావడంతో ఓపెనర్ గా ఉన్న ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. భారత్ జట్టు స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.
- Tags
- india
- west indies
Next Story

